తల్లులకు తనివితీరా మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిచ్చారు. ఈ సందర్భంగా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద స్నానాలు చేశారు. కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పరిసరాల చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా, సుమారు 5వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, రఘుపతి పూజారులకు సేవలదించారు.
అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్లు..
సమ్మక్క, సారలమ్మను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రేలు కుటుంబ సమేతంగా వేర్వేరుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా, సంద్రాయం ప్రకారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు డోలి వాయిద్యాలతో కలెక్టర్లను గద్దెలపైకి స్వాగతించారు. పూజారులు కొక్కెర రమేశ్, కాక సారయ్య ఉన్నారు.
మేడారానికి భారీగా భక్తులు
సుమారు 5వేల మంది రాక
Comments
Please login to add a commentAdd a comment