జాతరలో వైద్యశిబిరాలు
● జిల్లా వైద్యాధికారి మురళీధర్
కురవి: మండలంలోని కందికొండ జాతరకు వచ్చే భక్తులకు సేవలందించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో జాతరలో వైద్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం జాతర జరుగుతుందని, ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు సేవలందించి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. నాలుగు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, పారామెడికల్ సిబ్బందికి డ్యూటీ వేసినట్లు తెలిపారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించి టార్గెట్లను పూర్తి చేయడంలో వెనుకబడి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమీల, స్థానిక వైధ్యాధికారి విరాజిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు సారంగం, సుధీర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సిబ్బంది ప్రసాద్, శ్రీహరి, ఒబిలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment