గుడ్ ఐడియా
మహబూబాబాద్ అర్బన్: నిత్యం రెండు కిలోమీటర్లు దూరంలోని బడికి వెళ్లాలి. నిర్ణీత సమయంలో సైకిల్‌పై వెళ్లలేకపోవడం, కాళ్లనొప్పులు రావడంతో ఆ విద్యార్థి మెదడుకు పనిచెప్పాడు. సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి హాయిగా దానిపై బడికి వెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం జగన్ కాలనీకి చెందిన ఆదర్శ్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల తన నివాసానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు సైకిల్ కొనిచ్చారు. రోజూ నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కడం, సమయానికి పాఠశాలకు చేరుకోకపోవడం, కాళ్లు నొప్పి పెడుతుండడంతోపాటు తొందరగా వెళ్లేందుకు ఏమి చేయాలన్న ఆలోచన చేశాడు. ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి ఎలక్ట్రిక్ కిట్‌ను రూ. 20 వేలతో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. తన సైకిల్‌కు అమర్చాడు. ఆ రోజునుంచి హాయిగా పాఠశాలకు వెళ్లొస్తున్నాడు. గంట చార్జింగ్ పెడితే 40 కి.మీ స్పీడ్‌తో 35 కిలో మీటర్లు పోవచ్చని, రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతో అవకాశం ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేస్తానని ఆదర్శ్ ‘సాక్షి’తో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment