ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
మహబూబాబాద్: ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో భూ వివాదాలు, అట్రాసిటీ కేసులపై రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌కు వచ్చిన వెంకటయ్యకు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఘన స్వాగతం పలికారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ వెంకటయ్య మాట్లాడారు. జిల్లాలో దళితుల భూ సమస్యలకు సంబంధించి వారం రోజుల్లో నివేదికలు అందజేయాలన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ నెల చివరి వారంలో సివిల్ రైట్స్‌డేను తప్పకుండా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భూ సమస్యలు, మూఢనమ్మకాలు తదితర సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందేవిధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాలో అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలన్నారు. మూడు నెలల పాటు గురుకులాలను సందర్శించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోనే మెస్ చార్జీలు పెంచిందన్నారు. ఆర్‌ఓఆర్ నిబంధనల ప్రకారం పదోన్నతులు, నియామకాలు చేపట్టాలన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన కేసులపై తహసీల్దార్ల నుంచి ప్రాథమిక నివేదికలు అందాయని, వాటిపై 15రోజుల్లో సమగ్ర నివేదికను కమిషన్‌కు అందజేస్తామన్నారు. జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు గుగులోత్‌కిషన్ నాయక్, కామ సంజీవరావు, పరికిపండ్ల అశోక్, సామ్యేల్, కుల సంఘం నాయకుడు వీరస్వామి జిల్లాలోని పలు సమస్యలను చైర్మన్‌కు వివరించారు. కుల సంఘాల నాయకులు పలు సమస్యలపై చైర్మన్‌కు వినతులు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అడిషనల్ ఎస్సీ చెన్నయ్య, తొర్రూరు, మా నుకోట ఆర్డీఓలు గణేష్, కృష్ణవేణి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు గడ్డం అశో క్, నర్సయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం..
చైర్మన్‌కు వినతుల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment