లైబ్రేరియన్‌పై దాడి.. యువకుడి అరెస్ట్
● 10 గ్రాముల బంగారు ఆభరణం స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఏసీపీ పార్థసారథి
జనగామ: జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ భూక్యా ఉపేందర్‌పై దాడి చేసి బంగారు చైన్ ఎత్తుకెళ్లిన యువకుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పార్థసారథి తెలిపారు. ఈ మేరకు బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై భరత్‌తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా బక్కరుప్పుల తండాకు చెందిన కేలోత్ సాయికృష్ణ గత నెల14వ తేదీన ఏదైనా ఉద్యోగం చేయడానికి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చాడు. ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అడ్మిషన్ లేకుండా ఇక్కడ ఉండొద్దని హాస్టల్ వార్డెన్ పంపించాడు. దీంతో పీజీ అడ్మిషన్ కోసం ఈ నెల4వ తేదీన ఏబీవీ డిగ్రీ కళాశాలకు వెళ్లాడు. ఆ సమయంలో లైబ్రరీ అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలో చోరీ చేస్తే సులువుగా డబ్బులు సంపాదించొచ్చనే ఆలోచనతో ఈ నెల5వ తేదీన డిగ్రీ కళాళాల లైబ్రేరియన్ రాగానే అతడిపై దాడికి పాల్పడి మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై సీఐ దామోదర్ రెడ్డి, ఎస్సై భరత్, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు బాలాజీనగర్‌లోని విజయ లాడ్జిలో ఉన్న సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించగా రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పార్థసారథి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment