బదిలీలకు సబ్ రిజిస్ట్రార్ల ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖలో బదిలీలు ఎప్పుడంటూ సబ్ రిజిస్ట్రార్లు ఎదురుచూస్తున్నారు. జూలై 31వ తేదీన జీరో ట్రాన్స్‌ఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ ఐజీ, ప్రభుత్వం ప్రకటించిన బదిలీల ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అటెండర్‌స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జోన్‌లో భాగంగా జోన్–1 బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఉమ్మడి వరంగల్‌కు గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్‌లతోపాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఏకకాలంలో జూలై 31వ తేదీన బదిలీల ప్రకటన, ఆగస్టు 1న జాయినింగ్‌లతో పూర్తిగా నూతన అధికారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారిపోయాయి.
ఓడీ పేరిట అక్టోబర్‌లో మరో జాబితా
సాధారణ, లాంగ్ స్టాండింగ్ బదిలీలకు బదులుగా కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అక్టోబర్ 15న ఓడీ (ఆన్ డ్యూటీ) పేరిట బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో జోన్‌లను దాటి హైదరాబాద్ వరకు ట్రాన్స్‌ఫర్స్ అయ్యాయి. గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు 19 మందికి స్ధాన చలనం కలిగింది. రెండు నెలల గడువులోనే మరో కార్యాలయానికి బదిలీకావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
20 మందితో మరో జాబితా..
‘మా జిల్లాకు మేము పోతాం. మాకు చాలా దూరమవుతుంది’ అంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఓడీ పేరిట 19 మంది గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, ఇదే కోవలో మరో 20 మందితో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బదిలీ జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్లు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
లాంగ్ లీవ్‌లో పలువురు..
ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్‌కు బదిలీపై వచ్చిన గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు తాము ఇంత దూరం ప్రయాణం చేయలేమని, ఈ కార్యాలయాల్లో పని చేయలేమంటూ కొందరు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని మరికొందరు లాంగ్ లీవ్ పెట్టారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అక్టోబర్‌లో ఓడీ పేరిట
19 మంది ట్రాన్స్‌ఫర్
20 మందితో మరో జాబితా రెడీ
సొంత జిల్లాకు
పోతామంటూ అభ్యర్థనలు
Comments
Please login to add a commentAdd a comment