సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
చిన్నగూడూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అధికారులు, కమిటీ సభ్యులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ రామారావు అన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలో చేపడుతున్న సర్వేను ఎంపీడీఓ పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు, కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ప్రమోద్ రెడ్డి, నర్సయ్య, అధికారులు భాస్కర్, మల్లేష్, వీరన్న పాల్గొన్నారు.
సర్వే పాదర్శకంగా జరగాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అధికారులు పారదర్శకంగా నిర్వహించి, అర్హులకు న్యాయం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న అన్నారు. 24వ వార్డు పరిధిలోని లెనిన్ నగర్ కాలనీలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అధికారులు చేసి వివరాలను యాప్‌లో నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment