ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయని అధికారులు
నెల్లికుదురు: మండలంలోని నైనాల ఎంపీ యూపీఎస్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రామరాజు కవిత కోరారు. ఈ మేరకు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జి.రాజన్న స్టడీ ఆన్‌లివ్ డీఈఓ ఉత్తర్వుల ప్రకారం డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు తెలిపారు. అప్పటి నుంచి మూడు నెలలుగా 7 క్లాసులున్న పాఠశాలకు ఇప్పటి వరకు ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయలేదన్నారు. ఎంఈఓ స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని లేకుంటే డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిర్ర రమ, వద్డోలు రేణుక, మంజుల, సారమ్మ, పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment