న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన
మహబూబాబాద్ రూరల్: ఆటో డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో కిరాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఇంటి ఎదుట డ్రైవర్ మృతదేహంతో కుటుంబ సభ్యులు బుధవరాం ఆందోళన చేశారు. వివరాలు.. మండలంలోని దర్గాతండా జీపీ పరిధిలోని లాక్యతండాకు చెందిన బానోత్ ప్రవీణ్ (25) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ ఇంటి ఎదుట నివాసం ఉండే గుగులోత్ ప్రశాంత్ మంగళవారం ఖమ్మం వెళ్లేందుకు ఆటో కిరాయికి వస్తావా అని ఆటో డ్రైవర్ ప్రవీణ్ అడిగాడు. దీంతో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం రుక్కితండా స్టేజీ సమీపంలోకి వెళ్లగా చత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న తుఫ్రాన్ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ప్రవీణ్ అక్కడిక్కడే మృతిచెందాడు. ప్రశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ప్రవీణ్ మృతిచెందిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు, తండావాసులకు ప్రశాంత్ చెప్పలేదని ఆరోపించారు. తమకు తాముగా తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్లామన్నారు. మృతుడు ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment