● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య
నెహ్రూసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే ఏకై క మార్గమని, అందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ వార్డుల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తున్న పార్టీ నాయకులకు ప్రజలు అనేక సమస్యలు ఏకరువుపెడుతున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన పింఛన్లు, రేషన్‌కార్డులు, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతీ పేదవాడికి ఎలాంటి షరతులు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యుడు సూర్నపు సోమయ్య, నాయకులు సమ్మ్మెట రాజమౌళి, బానోత్ సీతారాంనాయక్, రావుల రాజు, అల్లి శ్రీనివాస్‌రెడ్డి, చిపిరి యాకయ్య, బానోత్ హేమానాయక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment