హామీల అమలులో ప్రభుత్వం విఫలం
గార్ల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ నాయకుడు కందునూరి శ్రీనివాసరావు కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో గార్ల, సీతంపేట, పినిరెడ్డిగూడెం గ్రామాల్లో బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి అలువాల సత్యవతి, రాజారావు, పెద్దవెంకటేశ్వర్లు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు రూరల్: హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకుబ్ అన్నారు. బుధవారం మండలంలోని గుర్తూరు, జమస్తాపురం గ్రామాల్లో సర్వే నిర్వహించారు.
కేసముద్రం: మండల కేంద్రంలోని కట్టుకాల్వతండాలో పలు సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు.
బయ్యారం: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment