దళిత రైతులకు సాగు భూమి ఇవ్వాలి
మరిపెడ రూరల్: గత ప్రభుత్వం హయాంలో ఆసైన్డ్‌మెంట్ పట్టాలిచ్చిన దళిత రైతు కుటుంబాలకు సాగు భూమిని గుర్తించి ఇవ్వాలని సీపీఎం మండల నాయకుడు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మండలంలోని వీరారం గ్రామ దళితులతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొండ ఉప్పలయ్య, బాధిత దళిత రైతులు గంట భద్రయ్య, గంట నాగయ్య, శ్రీనివాస్, ఏర్పుల రవి, దర్శనపు పుల్లయ్య, గుండె వీరయ్య, బాష్పంగు వెంకన్న, మల్లయ్య, వెంకన్న, రాములమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment