కురవి: మండలంలోని నేరడ శివారు రాయినిపట్నం, లింగ్యాతండా గ్రామాలలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామకాలను కురవి మండల సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్ చీకటి మహేష్ గౌడ్ బుధవారం అందజేశారు. లింగ్యాతండా 56వ బూత్ అధ్యక్షుడిగా లావుడ్య రమేష్, రాయినిపట్నం 40వ బూత్ అధ్యక్షుడిగా కోల వెంకన్న గౌడ్‌లకు నియామక పత్రాలను అందజేశారు. శ్రీరామోజు నాగరాజు, పెంటయ్య, సోమ రమేశ్ పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
కురవి: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ 2025న అమలులోకి తీసుకురానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్స్(యూపీఎస్)కి వ్యతిరేకంగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో ఈనెల 22న వరంగల్‌లో తలపెట్టిన కాకతీ కదనభేరీ వాల్‌పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివప్రసాద్, జిల్లా అధ్యక్షులు పూసపాటి నాగముణి, రాష్ట్ర కార్యదర్శి ఆవునురి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు సారంగపాణి పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు
పరిష్కరించాలి
మహబూబాబాద్: మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఎంటీఏ జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఉపేందర్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీర్తనారెడ్డి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ భగవాన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంగీత, నాగేశ్వర్‌రావు, సౌజన్య, ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment