పెద్ద వైద్యుడికి చూపిస్తానని మోసం
ఎంజీఎం: మంచి వైద్యులకు చూపిస్తానంటూ నమ్మబలికి వృద్ధురాలిని మోసం చేశాడో అపరిచితుడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు బత్తోజు విమలమ్మ చికిత్స కోసం బుధవారం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆమెతో మాట కలిపాడు. మీదీ మాదీ ఒకే ఊరు అని చెప్పాడు. పెద్ద వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపిస్తానంటూ వృద్ధురాలి నుంచి మొదట రూ.500 తీసుకున్నాడు. అనంతరం మీ బిడ్డకు ఫోన్ పే చేస్తానని చెప్పి మరో రూ.500 తీసుకుని పరారయ్యాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడే చెట్టు కింద కూర్చొని దిగాలుగా ఉన్న విమలమ్మను ఆర్‌ఎంఓలు శ్రీనివాస్, శశి గమనించి ఏం జరిగిందని ఆరా తీశారు. జరిగిన విషయాన్ని వృద్ధురాలు ఆర్‌ఎంఓలకు వివరించింది. అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించి వృద్ధురాలిని మోసగించిన వ్యక్తి మాస్క్ వేసుకుని వృద్ధురాలిని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎంజీఎంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆర్‌ఎంఓ శ్రీనివాస్ తెలిపారు.
‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం’
డోర్నకల్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. డోర్నకల్‌లో బుధవారం జరిగిన పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల నియామక సమావేశంలో వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు. ఏడాది పాలనలో హామీలను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీజేపీ బూత్ అధ్యక్షులుగా ఎన్నికై న వారు పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ ఎన్నికల అధికారి గుగులోతు లక్ష్మణ్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ కలువల త్రిలోక్, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ ధర్మారపు వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గుగులోత్ దేవ్‌సింగ్, మండల అధ్యక్షుడు గణేష్‌నాయక్, జయరాజ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment