శిక్షణ పూర్తి.. ఇక విధుల్లోకి
మామునూరు: మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 457మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సమాజానికి సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. 9నెలలపాటు కఠోర శిక్ష ణను విజయవంతంగా పూర్తి చేసుకున్న శిక్షణార్థులు.. రేపటి నుంచి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితంకానున్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు టీజీఎస్పీ బెటాలియన్ మైదానంలో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ జరగనుంది. ఈమేరకు బెటాలియన్ కమాండెంట్ రాంప్రకాశ్ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహణకు గురువారం సాయంత్రం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరేడ్ మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశా రు. ఈ కార్యక్రమానికి టీజీఎస్పీ అడిషనల్ డీజీపీ విజయ్‌కుమార్ ముఖ్యఅతిఽథిగా, అతిథులుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, డీసీపీ రవీందర్ హాజరుకానున్నారు. కాగా, దీక్షాంత్ పరేడ్ అనంతరం ఆయా జిల్లాలోని ఎస్పీలకు టీజీఎస్పీ స్పెషల్ కానిస్టేబుళ్లు జాయినింగ్ రిపోర్ట్ అందజేయాల్సి ఉంటుందని కమాండెంట్ రాంప్రసాద్ తెలిపారు.
నేడు టీజీఎస్పీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్
మామునూరు బెటాలియన్‌లో
ఏర్పాట్లు పూర్తి
ఉదయం 9గంటలకు పాసింగ్
అవుట్ పరేడ్ ప్రారంభం
హాజరుకానున్న టీజీఎస్పీ అడిషనల్ డీజీపీ విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment