డిటెన్షన్ విధానాన్ని విరమించుకోవాలి
కురవి: నూతన విద్యావిధానం పేరుతో పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డిటెన్షన్ విధానాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కురవిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 5, 8వ తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల డ్రాపౌట్స్ పెరుగుతారని, పేద పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలే నష్టపోతాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నత విద్యలో ప్రవేశించే వారు కేవలం 23 శాతం ఉంటే ఎస్సీల్లో 11.6శాతం, ఎస్టీల్లో 7.3శాతం మాత్రమే ఉన్నారన్నారు. దేశ అక్షరాస్యత 74.04 శాతం ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతారని, బాలిక విద్య మరింత దిగజారుతుందన్నారు. కేవలం మార్కులు, గ్రేడ్లతో విద్యార్థుల జ్ఞానాన్ని కొలవడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సహాయ కార్యదర్శి దామెర కిరణ్, నాయకులు పట్ల మధు, సూర్య ప్రకాశ్, జ్యోతిబసు, సింహాద్రి, గుండ్ల రాకేశ్, మురళి, మౌలానా, మహేశ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను
Comments
Please login to add a commentAdd a comment