సంవేదనల ప్రతిరూపమే ‘నుమాయిష్’
హన్మకొండ కల్చరల్: రచయిత్రి తన జీవితంలో ఎదుర్కొన్న సంచలనాలు, సంవేదనల ప్రతిరూపమే ‘నుమాయిష్’ అని.. తన ఆలోచనలను చక్క టి కథల రూపంలో వెలువరించారని నల్సార్ యూ నివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కృష్ణదేవరావు అన్నా రు. వరంగల్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో.. గురువారం హనుమకొండ నయీంనగర్ వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో కవి, రచయిత డాక్టర్ వాణి దేవులపల్లి రచించిన ‘నుమాయిష్’ కథా సంపుటి ఆవిష్కరణ సభ నిర్వహించారు. ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ కృష్ణదేవరావు ముఖ్య అతి థిగా పాల్గొని కథా సంపుటిని ఆవిష్కరించారు. అ నంతరం మాట్లాడుతూ.. రచయిత డాక్టర్ వాణి దే వులపల్లిని అభినందించారు. సింగరాజు రమాదేవి పుస్తకాన్ని సమీక్షించారు. సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహరబాబు, బిల్ల మహేందర్, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అశ్విన్, సతీ శ్, శ్రీ నివాస్ తదితర కవులు, రచయితలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment