నగరంలో మహిళా దొంగలు
హసన్‌పర్తి: ఇప్పటి వరకు పురుషులే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతుండగా, ఇప్పడు కొత్తగా మహిళలు కూడా చోరీలకు తెరలేపారు. చెత్త సేకరణకు వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లు టార్గెట్‌గా చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కారు. కేయూ పీఎస్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీల ఘటనలో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు ఆ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పీఎస్ పరిధిలోని విజయ్‌నగర్‌కాలనీకి చెందిన సయ్యద్ ఆసిఫ్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగింది. ఈ ఘటనలో 18 తులాల బంగారంతోపాటు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రవికుమార్,ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు మహిళలు ఘటన జరిగిన ప్రదేశంలోని ప్రహరీలు దూకుతున్నట్లు గురించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈమేరకు భీమారంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు.
చోరీలు చేస్తున్న అత్త, ఇద్దరు కోడళ్లు..
ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన అత్తాకోడళ్లు కడమంచి లచ్చమ్మ, తూర్పాటి రాజీమేరి, పర్వతం కనకలక్ష్మిగా తేలింది. వీరు చెత్త సేకరణ కోసం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తాళాలు ఉన్న ఇళ్లు టార్గెట్ చేసుకుంటున్నారని ఏసీపీ దేవేందర్‌రెడ్డి చెప్పారు. కాగా, విజయ్‌నగర్‌కాలనీలోకి ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారని ఏసీపీ దేవేందర్‌రెడ్డి చెప్పారు. వీరిని రిమాండ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో చెత్త సేకరణ కోసం వచ్చే వారి ఫొటోలను తీయాలని ఏసీపీ చెప్పారు.
అత్త, ఇద్దరు కోడళ్లు చెత్త సేకరణకు వచ్చి చోరీలు
తాళాలు వేసి ఉన్న ఇళ్ల టార్గెట్..
సీసీ ఫుటేజీతో గుర్తింపు
వివరాలు వెల్లడించిన ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment