విద్యార్థిపై కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : అధ్యాపకుడిపై దాడి చేసిన ఓ విద్యార్థిపై కేసు నమోదు చేశామని మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక బుధవారం తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండగా అధ్యాపకుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గదిలో పరీక్ష రాస్తున్న సదరు విద్యార్థి అల్లరి చేస్తుండగా ఎందుకు చేస్తున్నావని మందలించాడు. దీంతో పరీక్ష రాస్తున్న విద్యార్థి కర్రతో అధ్యాపకుడిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అధ్యాపకుడి ఫిర్యాదు మేరకు విద్యార్థిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
దొరికిన చిన్నారి అద్విత ఆచూకీ
● వేములవాడలో అదృశ్యం.. మహబూబాబాద్‌లో లభ్యం
● రంగంలోకి ఏడు పోలీస్ బృందాలు
సిరిసిల్లక్రైం: వేములవాడ రాజన్న గుడికి తల్లితో పా టు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పది రోజుల క్రితం తప్పిపోగా.. పోలీసులు ముమ్మర గాలింపుతో మ హబూబాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన సింగారపు లాస్యకు మతిస్థిమితం సరిగా లేదు. ఈక్రమంలోనే తన కూతురు అద్వితతో కలిసి డిసెంబర్ 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబీకులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. డిసెంబర్ 28న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చినట్లు లాస్య సోదరుడు పలమారి గంగాస్వామికి తెలియడంతో వెంటనే ఇక్కడికి వచ్చాడు. అయితే అద్విత కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా డు. వేములవాడలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అద్వితను ఇద్దరు గుర్తుతెలియని మహిళలు అహరించుకుపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ ఏడు పోలీస్ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే బుధవారం మహబూబాబాద్‌లో అద్విత ఆచూకీ లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment