సామాజిక ఉద్యమ కవులను స్ఫూర్తిగా తీసుకోవాలి
● ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి
కేయూ క్యాంపస్: డాక్టర్ కత్తి పద్మారావులాంటి సామాజిక ఉద్యమ కవులను స్ఫూర్తిగా తీసుకోవాలని హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి కోరారు. బుధవారం హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీలో తెలుగు విభాగంలో మహాకవి కత్తిపద్మారావు రచించిన ‘అస్పృష్యనియుద్ధగాథ’ మూడో గ్రంథాన్ని ఆ కళాశాల ప్రొఫెసర్, ఆ విభాగం అధిపతి డాక్టర్ సదాశివ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడారు. నేటి యువత అఽభ్యుదయపథంలో సాగాలని కోరారు. డాక్టర్ సదాశివ్ మాట్లాడుతూ మహాకవి, దళిత ఉద్యమకారుడు డాక్టర్ కత్తిపద్మారావు స్వీయగాథను దళితోద్యమ నేపథ్యంలో మూడుభాగాలుగా తన స్వీయచరిత్రగా రచించారన్నారు. ఈ మూడో గ్రంథాన్ని తన ఆత్మీయ మిత్రుడు వల్లంపట్ల నాగేశ్వర్‌రావు ,ఆయన సతీమణి కె. రాజపద్మకు అంకితం ఇవ్వడం గర్వకారణమన్నారు. గ్రంథస్వీకర్త వల్లంపట్ల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ నేటి యువత హేతువాద దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. తనకు ఆ గ్రంథాన్ని అంకితం ఇచ్చిన కత్తిపద్మారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు మామిడి లింగయ్య, చింతం ప్రవీణ్, రాజ్‌కుమార్, శ్రీధర్, భిక్షపతి, మ్యాకల సూరయ్య, మేడి సురేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment