మహబూబాబాద్: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 25న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ ఆటోమెటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానుకోటలో, మారుతి సుజికి నెక్సా వరంగల్ నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు గాను జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన పురుష అభ్యర్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జాబ్‌మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం 9133382193 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment