‘ఆత్మీయభరోసా’ వద్దని తీర్మానం
బయ్యారం: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, ఎవరికీ పథకం వర్తింపజేయవద్దని ప్రజాపాలన గ్రామసభలో తీర్మానం చేసిన ఘటన మండలంలోని ఇర్సులాపురంలో గురువారం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో 82 మందిని ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకానికి అర్హులుగా అధికారులు గ్రామసభలో పేర్లు చదివి వినిపించారు. అందులో ఒకరు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండడంతో పాటు చాలామంది భూములు ఉన్నవారి పేర్లు వచ్చాయని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదం చేశారు. మరోసారి ఆత్మీయ భరోసా పథకంపై సర్వే చేసి అర్హులకు పథకం వర్తింపజేయాలని తీర్మానం చేసి సభను ముగించారు.
మన్నెగూడెం గ్రామసభలో ఘర్షణ...
చిన్నగూడూరు: మండలంలోని మన్నెగూడెం గ్రామసభలో గురువారం ఘర్షణ నెలకొంది. ముందుగా అధికారులు సంక్షేమ పథకాల ఎంపిక జాబి తాను చదివి వినిపించారు. కాగా రేషన్ కార్డుల ఎంపికలో అర్హులను విస్మరించారని స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్త అతడి చెంపపై కొట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం గ్రామసభ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment