పూలబాటతో స్వాగతం
సాక్షి, వరంగల్: ఆడపిల్లలు చదువులో రాణిస్తూ అన్నిరంగాల్లో దూసుకుపోయి సత్తా చాటుతున్నా ఇంకా పలుచోట్ల బలవంతపు వివాహాలు చేస్తూ బలి చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఇప్పటికీ తరచూ బాల్య వివాహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆరు జిల్లాల్లో 2023 సంవత్సరం 106 బాల్యవివాహాలను అధికారులు ఆడ్డుకోగా.. గత ఏడాది ఏకంగా 140 వరకు నిరోధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేసముద్రం: ఆడపిల్ల పుడితే మాకొద్దంటున్నా ఈ రోజుల్లో మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆ తల్లీబిడ్డలకు పూలబాట వేసి అత్తారి ల్లు స్వాగతం పలికింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి పొడకంటి క్రాంతి కుమార్, సుమ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గత ఏడాది నవంబర్‌లో సుమకు మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించింది. ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి రాగా రకరకాల పూలతో బాటవేసి అపూర్వ స్వాగతం పలికారు.
నెహ్రూసెంటర్: ఆడపిల్ల పుట్టడంతో ఆ ఇంట్లో లక్ష్మీదేవిగా భావిస్తూ వినూత్న వేడుకకు శ్రీకారం చుట్టారు. మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీకి చెందిన ప్రశాంత్ –వర్ష దంపతులకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. తమ ఇంట లక్ష్మీదేవి జన్మించిదని గత ఏడాది అక్టోబర్‌లో రూ.5 కాయిన్స్ (రూ.25 వేలు)తో అలంకరించి మొదటి నెల వేడుకల ను కుటుంబ సభ్యులతో కలిసి కనుల పండువగా జరుపుకున్నారు.
ఆగని బాల్యవివాహాలు
ఆడపిల్ల.. లక్ష్మీదేవి..
Comments
Please login to add a commentAdd a comment