కేసీఆర్‌తోనే మానుకోట అభివృద్ధి
మహబూబాబాద్: మాజీ సీఎం కేసీఆర్ వల్లే మానుకోట పట్టణ రూపురేఖలు మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మానుకోట మున్సిపల్ పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవతిరాథోడ్ హాజరై మాట్లాడారు. పాలకమండలి సమన్వయంతో పనిచేసి మానుకోటను అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయ్యారని అభినందించారు. విలీన గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని, ఆ గ్రామాల ప్రజలు నష్టపోయారన్నారు. సమావేశానికి ముందు మాజీ ఎంపీ మాలోత్ కవిత మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్నతో పాటు కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కమిషనర్ నోముల రవీందర్, డీఈ ఉపేందర్, ఫ్లోర్‌లీడర్లు అజయ్‌సారథిరెడ్డి, సూర్నపు సోమయ్య, వెన్నం లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment