ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ కో రారు. డోర్నకల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం కలెక్టర్ పర్యటించి 10వ తరగతి సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, మెడిసిన్‌గది, ఆపరేషన్ థియేటర్‌ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాధ్విజతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బండి నర్సింహారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బలపాల పీహెచ్‌సీ తనిఖీ
కురవి: మండలంలోని బలపాల గ్రామంలోని పీహెచ్‌సీని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, మందుల విభాగలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మెనూ పకడ్బందీగా
అమలు చేయాలి
● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
కేసముద్రం: కామన్‌డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. గురువారం మండలంలోని అమీనాపురంలోని మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు స్టోర్, కిచెన్ గదులు, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, స్వచ్ఛమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం
● ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
తొర్రూరు: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలో గురువారం టీఎస్ యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి ఎమ్మెల్సీ మాట్లాడారు. పీఆర్‌సీ గడువు 2023 జూలైతో ముగిసిందని, కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ–కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కస్తూర్బా ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీగా బరిలో నిలుస్తున్నానని, ప్రశ్నించే గొంతుకను మళ్లీ మండలికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జనార్దనాచారి, రమేశ్, ఆడిట్ కమిటీ సభ్యుడు భిక్షపతి, నాయకులు వెంకన్న, వెంకటేశ్వర్లు, రంజిత్, వంశీకృష్ణ, జనార్దన్, పార్వతి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
అతిథులొచ్చాయి..
మహబూబాబాద్ రూరల్: వేసవి విడిది కోసం సైబీరియన్ కొంగలు జిల్లాకు వచ్చాయి. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం గ్రామానికి సుమారు యాభై వరకు కొంగలు వచ్చి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉదయం చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లి చెరువులు, కుంటల వద్ద ఉంటూ ఆహారం సేకరిస్తున్నాయి. మళ్లీ తిరిగి వచ్చి చెట్లపై గూళ్ల వద్ద సందడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment