పోలీసులు సవాళ్లకు ఎదురెళ్లాలి
మహబూబాబాద్ అర్బన్: పోలీస్ ఉద్యోగం సవాళ్లతో కూడినదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీసులకు శారీరక, మానసిక దృఢత్వం అవసరమని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ మైదానంలో మూ డురోజులుగా నిర్వహించిన పోలీస్ క్రీడలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. పోలీస్ క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం విధుల్లో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నా రు. పని ఒత్తిడితో ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. అనంతరం గె లుపొందిన పోలీస్ క్రీడాకారులకు ప్రథమ, ద్వి తీ య, తృతీయ బహుమతులు అందజేశారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, డీఎఫ్‌ఓ విశాల్‌ను ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీని వాస్, విజయ్‌ప్రతాప్, కృష్ణకిషోర్, మోహన్, శ్రీని వాస్, సీఐలు, దేవేందర్, సర్వయ్య, రాజ్‌కుమార్‌గౌడ్, రవికుమార్, ఎస్సైలు, పీడీలు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
ముగిసిన పోలీస్ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment