వాగ్వాదం.. బహిష్కరణలు
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ కౌన్సిల సాధారణ సమావేశం వాడీవేడిగా సాగింది. ప్రధానంగా ప్రతీవార్డుకు రూ.5లక్షల నిధుల కేటాయింపుపై కమిషనర్‌తో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. అది సాధ్యంకాదని కమిషనర్ తెలపడంతో కౌన్సిలర్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోగా.. ఆ తర్వాత కౌన్సిలర్లు కూడా బయటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ సమస్య సద్దుమణిగేలా చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పాలకమండలి చివరి సమావేశం కౌన్సిలర్లకు నిరాశనే మిగిల్చింది.
సాధ్యం కాదు..
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌ న్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే గతంలో తీర్మానం చేసిన విధంగా ప్రతీ వార్డుకు రూ.5లక్షలు కేటా యించాలని సీపీఎం ఫ్లోర్‌లీడర్ సూర్నపు సోమ య్య, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథిరెడ్డి పట్టుబట్టారు. ఈ అంశంపై కమిషనర్ నోముల రవీందర్ మాట్లాడుతూ.. జనరల్‌ఫండ్ ప్రస్తుతం జీరోగా ఉందని, రెండు నెలలుగా సర్వే, ప్రజాపాలన సభల వల్ల పన్నుల వసూళ్లు జరగడం లేదన్నారు. ఆర్థికభారం ఉందని రూ.5లక్షల కేటాయింపు సాధ్యం కాదన్నారు. దీంతో అజయ్‌సారథిరెడ్డి, సూర్నపు సోమయ్య,పలువురు కౌన్సిలర్లు తీవ్ర ఆ గ్రహం వ్యక్తం చేశారు.గత కౌన్సిల్‌లో తీర్మానం చేసి న దానికి విలువ లేకుండా మాట్లాడం సబబుకాద ని కమిషనర్‌తో వాగ్వాదం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్, ఇ తర నిధుల నుంచి ప్రతీవార్డుకు రూ.5లక్షల కేటా యింపు పెద్ద సమస్యనే కాదని కౌన్సిలర్లు అన్నారు.
సమన్వయంతోనే అభివృద్ధి..
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. వార్డులకు నిధుల కేటాయింపు విషయంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తీర్మానం చేసి కౌన్సిలర్లకు న్యాయం చేయాలన్నారు. సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి నిధులు రెండు సంవత్సరాల నుంచి రాకపోవడంతో సమస్య తలెత్తిందన్నారు. మార్చి నాటికి పన్నుల రూపంలో జనరల్ ఫండ్ వస్తుందని దానిని పరిగణనలోకి తీసుకుని వార్డుకు రూ.5లక్షలు కేటాయించాలన్నారు. వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. స్టాంప్ డ్యూటీ నిధులు ఇటీవల రూ.10.53 కోట్లు విడుదల అయ్యాయని, దీంతో వేతనాల సమస్య తీరుతుందన్నారు. ప్రతీవార్డుకు రూ.5లక్షల కేటాయింపు విషయంలో కమిషనర్ వైఖరిని నిరసిస్తూ సమావేశం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ రవీందర్‌రావు కూడా సమావేశం పూర్తికాక ముందే వెళ్లిపోయారు. సమావేశంలో డీఈ ఉపేందర్, ఫ్లోర్‌లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, మేనేజర్ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ వర్సెస్ కౌన్సిలర్లు
వాడీవేడిగా మానుకోట
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కౌన్సిలర్లకు నిరాశే మిగిలింది..
సమావేశం బహిష్కరణ..
ప్రతీ వార్డుకు రూ.5లక్షల కేటాయింపులో తాను ఏమీ చేయలేనని కమిషనర్ రవీందర్ ఉదయం 11.39గంటలకు సమావేశం నుంచి బయటికి వెళ్లారు. దీంతో పలువురు కౌన్సిలర్లు తాము చేయాల్సిన బహిష్కరణ కమిషనర్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించి ఎలా వెళ్తారని అధికారులతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశా రు. కౌన్సిలర్లు కూడా బయటికెళ్లేందుకు సిద్ధం కాగా చైర్మన్, ఎమ్మెల్సీ వారిని బుజ్జగించారు. కమిషనర్‌ను చైర్మన్‌తో పాటు పలువురు కలిసి సమావేశానికి రావాలని సర్ది చెప్పారు. ఎట్టకేలకు 11.54కు మళ్లీ వచ్చారు. నిధుల కేటాయింపు విషయంలో కమిషనర్ అదే సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్నతో పాటు ఫ్లోర్‌లీడర్లు, కౌన్సిలర్లు బహిష్కరించి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment