బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి
కురవి: బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా సెషన్ కోర్టు జడ్జి సురేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నేరడ మోడల్ పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు అవగాహన కల్పించారు. ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు చదువుతో పాటు సామాజిక అంశాల్లో రాణించాలన్నారు. పురుషులతో సమానంగా బాలికలు పోటీపడాలన్నారు. దేశంలో భ్రూణహత్యలు జరుగుతున్నాయని, వాటిని నివారించాల్సిన అవసరం ఉందని, బాలికలు అప్రమత్తంగా ఉండి సమాజంలో జరుగుతున్న చెడును పారదోలేందుకు కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలు ఆంక్షలను పక్కన పెట్టి చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, కురవి ఎస్సై గండ్రాతి సతీష్, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలికల భద్రత అందరి బాధ్యత
తొర్రూరు: బాలికల భద్రత అందరి బాధ్యత అని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో అన్ని విభాగాల్లో బాలికలు, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా నేటికీ వారిపై వివక్ష కొనసాగుతుందన్నారు. అవసరమైన సమయంలో చట్టాల సాయంతో కోర్టుల ద్వారా రక్షణ పొందాలన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ మణెమ్మ, ధర్మశ్రీ ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు ధరా వత్ విమల, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా సెషన్ కోర్టు జడ్జి సురేశ్
ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment