ప్రజల కోసమే ఎర్రజెండా ..
నెహ్రూసెంటర్ : అధికారమున్నా లేకపోయినా దేశంలో ప్రజల పక్షాన పోరాడి విజయం సాధించిన ఘనత సీపీఐకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తి చిహ్నం, మానుకోట మొదటి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్, మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనా యక్, సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా.. రంగులు ఎలిసిపోతున్నా చెక్కుచెదరని పార్టీ పతాకం ఎర్రజెండా మాత్రమేనన్నారు. ప్రజల పక్షాన పోరా టాలు నిర్వహించిన వందేళ్ల ఉద్యమ చరిత్ర సీపీఐకే దక్కుతుందన్నారు. దోపిడీదారులు అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి వస్తుంటే ప్రజల పక్షాన పోరాడే ఒక్క మావోయిస్టును కూడా ఉంచమని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటిస్తున్నారని, రాముడిని బందీగా చేసి బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో జత కట్టగా వారి మద్దతుతోనే పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు కమ్యూనిస్టుల మే లు మరిచి వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్.. కమ్యూనిస్టుల మద్దతు కూడగట్టుకోలేక పోవడం మూలంగానే గద్దె దిగిపోయిందన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పేదల కోసం సీపీఐ పని చేసిందన్నా రు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిందన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పోరాట పటిమలో కమ్యూనిస్టులే ముందుంటారన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా పోరాటా లు వదిలిపెట్టని యోధులు కమ్యూనిస్టులన్నా రు. మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనా యక్ మాట్లాడుతూ సమిష్టిగా మానుకోట నియోజకవర్గం అభివృద్ధి జరిగేలా పని చేద్దామన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నా రు. మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బి.అజయ్‌సారథిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వర్‌రావు, నల్లు సుధాకర్‌రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ నీరజారెడ్డి ధర్మన్న, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, రేషపల్లి నవీన్, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వర్‌రావు, పోగుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే
పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు
ఘనంగా సీపీఐ శతాబ్ది ఉత్సవ సభ
Comments
Please login to add a commentAdd a comment