కోటగుళ్ల గురించి తెలిపేందుకే స్కెచింగ్ టూర్
గణపురం : కోటగుళ్ల శిల్ప సంపదను ప్రపంచానికి చాటి చెప్పేందుకే రెండు రాష్ట్రాలకు చెందిన 60 మంది కళాకారులతో స్కెచింగ్ టూర్‌ను ఏర్పాటు చేసినట్లు టార్చ్ సంస్థ అధ్యక్షుడు అరవింద్ ఆర్య అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సేవా టూరిజం, టార్చ్ సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మంది కళాకారులను పిలిపించినట్లు తెలిపారు. కళాకారులు పెన్సిళ్లతో వేసే అద్భుత కోటగుళ్ల శిల్ప సంపద చిత్రాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ గణపేశ్వరాలయం శిల్ప సంపద అద్భుతంగా ఉందని, ఆలయాలను చూసి ఎంతో పులకించిపోయామని తెలిపారు. కార్యక్రమంలో సేవా టూరిజం, కల్చర్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్, పురావాస్తు శాఖ ఏడీ మల్లు నాయక్, కట్ట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
టార్చ్ సంస్థ అధ్యక్షుడు అరవింద్ ఆర్య
Comments
Please login to add a commentAdd a comment