29న జాబ్‌మేళా
కాళోజీ సెంటర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 29వ తేదీన వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ క్యాంపస్‌లో గల వరంగల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం 7093168464 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సరస్వతీ పుష్కరాలకు రూ.70లక్షలతో విద్యుత్ లైన్‌లు
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరంలో టీజీ ఎన్పీడీసీఎల్ సంస్థ మరమ్మతులు, కొత్త లైన్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫర్మర్లు అమర్చడానికి రూ.70 లక్షలు కేటాయించినట్లు సంధింత శాఖ ఏఈఈ శ్రీకాంత్, లైన్ ఇన్‌స్పెక్టర్ సదానందం తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ నుంచి గోదావరి వరకు ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయనున్నారు. దేవస్థానానికి సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ లైన్ పనులు చేపట్టనున్నారు. ప్రధాన రహదారిలో రెండు ట్రాన్స్‌ఫర్మర్లు, వీఐపీ ఘాట్‌కు ప్రత్యేకంగా లైన్ నిర్మాణం 11కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయించారు. అతి త్వరలో పనులు ప్రారంభించడానికి సంబంధిత శాఖ అధికారులు ఎస్‌ఈ మల్సూర్, డీఈఈ పాపిరెడ్డి, ఏడీ నాగరాజు సన్నద్ధమవుతున్నారు.
రూ.40 లక్షల రివార్డు
అందుకున్న దీప్తి జీవాంజి
పర్వతగిరి: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం, ఇటీవల అర్జున అవార్డు అందుకున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజిని శనివారం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండల సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున రూ.25లక్షలు, అర్జున అవార్డు పొందిన నేపథ్యంలో మరో రూ.15 లక్షలు.. మొత్తం 40 లక్షల నగదు ప్రోత్సాహం అందించారు. కాగా, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు.. దీప్తి జీవాంజీకి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment