యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దు
కేయూ క్యాంపస్ : యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని, దేశభవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి అన్నారు. శనివారం నెహ్రూ యువకేంద్రం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ సౌజన్యంతో కేయూలోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్‌లో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపిక చేసిన యువతీయువకులకు రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం లేని సమాజ స్థాపన లక్ష్యంగా యవత పని చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ ప్రముఖ సైక్రియాటిస్టు డాక్టర్ ప్రహసిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువత డ్రగ్స్ తీసుకుంటే కలిగే అనర్థాలపై వివరించారు. మీ చుట్టుపక్కల వారు ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ కనిపిస్తే 1933 నంబర్‌కు తెలియజేయాలన్నారు. సమావేశంలో నార్కోడ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సైదులు, గణితశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ భారవిశర్మ, కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.పి.రాజ్‌కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత మధు, న్యాయవాది బానోత్ మహేందర్, ఎక్స్‌ఎన్‌వై వలంటీర్లు భిక్షపతి, సురేశ్ పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment