చదువుతోపాటు నైపుణ్యం ప్రధానం
ములుగు : ఎంత చదివామనేది ముఖ్యం కాదని, ఉ ద్యోగ సాధన సమయంలో మనలో ఏ నైపుణ్యం ఉందనేదే ప్రధాన అంశంగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. టాస్క్ (తెలంగాణ అకడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ప్రా రంభోత్సవానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాలా మంది డిగ్రీలు పూర్తి చేసుకొని రూ.3 నుంచి 5 వేల వరకు వేతనాలను తీసుకుంటూ స్థానికంగా ప్రైవేట్ జాబ్‌లతో సరిపుచ్చుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఉద్యోగాలకు అనుగుణంగా స్కిల్స్ పెంపొందించుకుంటే మంచి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చని అన్నారు. కష్టం నుంచి వచ్చిన విజయ విజయగాథగా మిగిలిపోతుందన్నారు. స్థానికంగా ఉద్యోగం లభించాలనే ధోరణిని వదిలి ఎక్కడైనా చేసి కుటుంబాన్ని పోషించగలుగతామనే ధైర్యంతో ముందుకుసాగాలని అన్నారు. రాష్ట్రంలో టాస్క్ తరపున ములుగులో ఏర్పడిన 14వ బ్రాంచ్ నిరుద్యోగ యువతకు వరం లాంటిదని అన్నారు. 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని సూచించారు. తాను ఒడిదుడుకులను ఓర్చుకొని మంత్రి హోదాలో ఇలా మీ ముందు ఉన్నానన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ వెంకటేశ్ సినిమా చూసి ఇంటర్వ్యూ అంటే ఇంత కష్టంగా ఉంటుందా, ఇంగ్లిష్‌లో మాట్లాడాలా అని తెలుసుకొని స్నే హితుడి ద్వారా లాంగ్వేజ్‌ను మెరుగుపరుచుకున్నానన్నారు. జిల్లాలో 50 వేల మంది యువత డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటున్నారని, అలాంటి వారికి టా స్క్ మంచి ఉద్యోగ సంపాదన స్టేజ్ లాంటిద న్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, సీఈఓఓ రాఘవేందర్‌రెడ్డి, రీజినల్ సెంటర్ హెడ్ నవీన్‌రెడ్డి, క్లస్టర్ మేనేజర్ సుధీర్, రిలేషన్‌షిప్ మేనేజర్ రామకృష్ణ, సెంటర్ మేనేజర్ మురళీకృష్ణ, డీపీఓ దేవరాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం పాల్గొన్నారు.
పోటీ ప్రపంచంలో ఇదే అవసరం
మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment