సృజనాత్మకను వెలికి తీయడానికే పోటీలు
హసన్‌పర్తి: విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను వెలికితీయడానికి పోటీలు దోహదపడుతాయని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న స్పార్క్రిల్ –25వేడుకలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిరుచులకనుగుణంగా ప్రదర్శనలు ప్రదర్శించాలన్నారు. కాగా, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ వస్త్రాధారణ ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని పురస్కరించుకుని తబలా, మోహందీ, ట్రెజర్ హంట్, ర్యాంప్ వాక్, లైవ్ బ్యాంక్‌తో పాటు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్
వరదారెడ్డి
ఎస్సార్‌లో స్పార్క్రిల్ వేడుకలు
ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment