No Headline
● 76వ గణతంత్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ అర్బన్: 76 గణతంత్ర వేడుకలను నేడు (ఆదివారం) అంబరాన్నంటేలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 9:05 గంటలకు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
అనంతరం మార్చ్‌ఫాస్ట్, ముఖ్యఅతిథి సందేశం, తదితర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ మీటింగ్ హాల్ ఐడీఓసీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment