కోస్టాయాప్ నిందితుల అరెస్ట్
జనగామ: రెట్టింపు డబ్బుల ఆశచూపించి అమాయకులను మోసం చేసిన కోస్టాయాప్‌నకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు శనివారం జనగామ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి ఏఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తోకల శ్రీధర్‌యాదవ్, కాషెగుడిసెకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎక్రమొద్దీన్., ఆస్ట్రేలియాకు చెందిన వెనెస్సాతో కలిసి కోస్టాయాప్‌ను తీసుకొచ్చారు. కోస్టాయాప్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు వస్తాయని ఆశచూపించారు. కోస్టాయాప్ లింక్‌ను ఫోన్‌కు పంపించి, బార్ కోడ్‌ద్వారా రిజిస్టర్ చేసుకుని పెట్టుబడులు పెట్టించారు. ఇందులో లింక్ ద్వారా చైన్ సిస్టమ్‌లో ఒకొక్కరిని చేర్చించారు. మూడు వందల మందిని చేర్పించిన వారికి గిఫ్ట్‌గా ద్విచక్రవాహనం, ఆరు వందల మందికి కారు బహుమానంగా ఇస్తామంటూ సామాన్యులకు ఆశ చూపించి ఆకర్షించారు. యశ్వంతాపూర్‌లోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో ఫంక్ష న్ ఏర్పాటు చేసి కోస్టాయాప్ ప్రమోట్‌లో కారు, బైక్, కుక్కర్ గెలుచుకుంటారని చెబుతూ అక్కడకు వచ్చిన వారి తో పెట్టుబడులు పెట్టించారు. అనంతరం స్పందించకపోవడంతో మోసం చేశారని గ్రహించి జనగామ, చేర్యాల చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తోకల శ్రీధర్‌యాదవ్, ఎక్రమొద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నే రం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వెనెస్సా పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఫోన్‌లో వచ్చిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దన్నారు. రిజిస్టర్ కాని యాప్‌లో పెట్టుబడులు పెట్టొద్దన్నారు. మల్టీలెవల్ చైన్ సిస్టమ్‌లో పెట్టుబడులు పెట్టేలా ఎవరూ ప్రోత్సహించొద్దన్నారు.అత్యవసర సమయంలో గంటలోపు (గోల్డెన్ అవర్)100కు డయల్ చేయాలని, సైబర్ క్రైంలో మోసపోయిన వెంటనే 1930(ఉచిత నెంబర్) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
రామప్పలో హెరిటేజ్ వాక్
వెంకటాపురం(ఎం): జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా టూరిజం అండ్ కల్చ రల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని రామప్ప దేవాలయం ఎదుట హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్‌లో రామప్ప సందర్శనకు వచ్చిన విద్యార్థులతో పాటు పర్యాటక శాఖ, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్ మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు వినోదం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కాకతీయుల చరిత్ర, పర్యాటక దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కుమారస్వామి, టూరిజం గైడ్ విజయ్‌కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
● పరారీలో ఆస్ట్రేలియాకు చెందిన మరో వ్యక్తి
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ పండేరి చేతన నితిన్
Comments
Please login to add a commentAdd a comment