దొంగలు ధ్వంసం చేసిన బీరువానుపరిశీలీస్తున్న ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి
కొత్తకోట రూరల్: కొత్తకోట పట్టణంలోని భవానీనగర్ కాలనీలో గల ఓ ఇంట్లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి వివరాల మేరకు.. మదనాపురం మండలం అజ్జకొల్లుకు చెందిన రాఘవేంద్రశెట్టి, లావణ్య దంపతులు కొత్తకోటలోని భవానీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. రాఘవేంద్రశెట్టి ఆత్మకూర్‌లోని సహార కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. లావణ్య కిరాణాషాపు నడుపుతోంది. రోజు మాదిరిగానే శుక్రవారం ఇంటికి తాళంవేసి, ఎవరి పనులకు వారు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు.. ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 3తులాల బంగారం, రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. రాత్రి 10గంటల సమయంలో ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు.. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి శనివారం జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment