రేపు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం | - | Sakshi
Sakshi News home page

రేపు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం

Published Fri, Oct 18 2024 12:42 AM | Last Updated on Fri, Oct 18 2024 12:42 AM

రేపు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారుల వారి విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం ఈనెల 19వ తేదీన జడ్చర్ల డివిజన్‌ ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేష్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల దీర్ఘకాలిక విద్యుత్‌ సమస్యలు ఏమైన ఉంటే నేరుగా ఫోరం దృష్టికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుతో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌, కరెంట్‌ బిల్లు జిరాక్స్‌ తీసుకురావాలని కోరారు. దీంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఫిర్యాదుతో పాటు ఆధార్‌, పట్టా పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలను జత చేయాలని సూచించారు. ఇందులో విద్యుత్‌ చౌర్యం, ప్రమాదాలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించమని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలుర)లో శనివారం ఉమ్మడి జిల్లా జూ నియర్‌ బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్య క్ష, కార్యదర్శులు ఒబేదుల్లా కొత్వాల్‌, విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల కు వచ్చే క్రీడాకారులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, బోనఫైడ్‌తో పాటు తమ వ్యక్తిగత కిట్లతో హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఖోఖో ఇన్‌చార్జి ఎస్‌.నిరంజన్‌యాదవ్‌, సామరమేష్‌, కృష్ణయ్యలను (9553124166, 9493450450, 9966549 345) సంప్రదించాలని ఆయన సూచించారు.

వాల్మీకి జీవితం ఆదర్శంగా తీసుకోవాలి: డీఐజీ

మహబూబ్‌నగర్‌ క్రైం: వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహన్‌ అన్నారు. జోగుళాంబ జోన్‌–7 డీఐజీ కార్యాలయంలో గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఐజీ పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. ఒక సామాన్య వ్యక్తిగా జన్మించి బోయవాడిగా జీవితం గడిపి సప్తఋషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకిగా మారి అ ద్భుతమైన రామాయణం గ్రంథం రచించి మ నకు అందించాడని తెలిపారు. వాల్మీకిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శవంతమైన జీవితం గడపలన్నారు. ఏఎస్పీ సురేష్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, వర్టికల్‌ డీఎస్పీ సుదర్శన్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement