ఎస్సీవర్గీకరణ విరమించుకోవాలి
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీకి ఓటు వేయమని చెప్పిన మందకృష్ణ మాదిగ మాటలకు తలొగ్గి సుప్రీంకోర్టు చేసిన సూచనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇకనైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని, లేనిపక్షంలో లక్ష మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు కేశవులు, కానుగడ్డ యాదయ్య, కంచిమి గోపాల్, బాలరాజు, రఘునాథ్, హన్మంతు, చెన్నకేశవులు, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment