పోలీసులు.. ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ ఉద్యోగం చాలా ఒత్తిడితో ఉంటుందని, ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసులు వారి ఆరోగ్యంపై కూడా అవసరమైన శ్రద్ధ పెట్టాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో మంగళవారం హైదరాబాద్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఐజీ హాజరై వైద్య శిబిరం ప్రారంభించారు. మొదట డీఐజీ సైతం పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకున్న తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విధుల్లో బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఇలాంటి ఆరోగ్య శిబిరాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ రోజువారి ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం తప్పక చేయాలని సూచించారు. ఒత్తిడి నివారణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, కేఆర్ ఆస్పత్రి వైద్యులు ప్రణీత్, విశ్వనాథ్, జ్యోతి, సందేష్ పాల్గొన్నారు.
● పరేడ్ మైదానంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి కేర్ ఆస్పత్రికి చెందిన అన్ని విభాగాల వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు, 2డీ–ఈకో, ఈసీజీ వంటి పరీక్షలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment