ఉత్సాహంగా జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సీఎం కప్–2024 క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వుషూ, జూడో, అత్యపత్య, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహిచారు. ఆయా క్రీడాంశాలకు సంబంధించి దాదాపు 300 నుంచి 350 మంది బాలబాలికలు హాజరయ్యారు. క్రీడాకారులతో స్టేడి యం సందడిగా మారింది. హ్యాండ్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, అత్యపత్య పోటీలను జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, పశుసంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సీఎం కప్‌పోటీల్లో జిల్లా జట్లు రాణించి చాంపియన్లుగా నిలవాలని కోరారు. రెజ్లింగ్, ఉషూ పోటీలను డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంకప్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతారని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్‌గౌడ్, పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్‌మోహన్‌గౌడ్, వడెన్న, పీడీలు వేణుగోపాల్, నిరంజన్‌రావు, పరశురాం, భానుకిరణ్, మేరిపుష్ప, ఉమాదేవి పాల్గొన్నారు.
రెండో రోజు క్రీడాఫలితాలు
రెజ్లింగ్ సబ్ జూనియర్ 46 కేజీ కేటగిరిలో రేఖ, 49 కేజీలో సౌమ్య, 45 కేజీలో దేవిశ్రీ ప్రసాద్, జగన్, 48 కేజీలో భరత్, 51 కేజీలో రాహుల్, 55 కేజీలో రాజ్‌కుమార్, 60 కేజీలో హన్మంతు, జూనియర్‌లో గిరిప్రసాద్ ఎంపికయ్యారు. వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీలో తీక్ష, తులసి, 81 కేజీలో సహస్ర, 61 కేజీలో బాలక్రిష్ణ, 73 కేజీలో కె.మహేష్, 81 కేజీలో రాఘవేంద్ర, 89 కేజీలో సూర్య సాయికుమార్, పవర్ లిఫ్టింగ్ 74 కేజీలో సాయికిరణ్, 83 కేజీలో రాఘవేంద్ర, జూడో 66 కేజీలో విక్రాంత్, 50 కేజీలో శ్రీజిత్, 55 కేజీలో ప్రియాంక ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment