ఊరూవాడా సంబరాలు
ఘనంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
మంత్రులు వేస్ట్.. కాదు కాదు పాలన వేస్ట్
ఆమాత్యుల పనితీరు మీద ఏపీ సీఎం సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఏపీ వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.
కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
● ఓయూ కృతజ్ఞత సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
ఉస్మానియా యూనివర్సిటీ: ఈ–కార్ రేసు కుంభకుణంలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇక నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. శనివారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి, పీహెచ్‌డీ విద్యార్థి చనగాని దయాకర్ అధ్యక్షత వహించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు విచ్చేసి ఇక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా.రియాజ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు మెడ శ్రీను పాల్గొన్నారు.
సాక్షి, అమరావతి: ఆరునెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడికావడం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు. తాజాగా.. మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు. కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు ఆధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా.. ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు. మంత్రివర్గంలో 75 శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సీఎం కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరుచేసి చూడలేమని, సీఎం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు గుర్తించారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీచేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా, ‘అధ్వాన్న పనితీరు’ పేరిట తమను నిందించడంలో అర్థంలేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు. పైపెచ్చు.. లోకేశ్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని.. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేల్లో తేల్చి ర్యాంకింగ్ ఇవ్వడం ఏమిటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.
పవన్ పనితీరుపైనా అసంతృప్తి..
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పనితీరు అంత బాగోలేదని నివేదిక తేల్చడమంటే.. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చినా ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడంలేదని, అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అద్దంపడుతోందని, అది కేవలం పవన్‌కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్వహిస్తున్న కీలకమైన మానవవనరుల (విద్యా శాఖలు) శాఖలో అన్నీ సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపైనా పెదవి విరుస్తున్నారు.
పెత్తనం లోకేశ్‌ది.. తిట్లు మాకా!?
ఈ ర్యాంకింగ్‌లపై మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేశారో తెలీడంలేదని సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేశ్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశమెక్కడ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు.
పనిచేసేది ఈ ఆరుగురే..
ఇక రాష్ట్ర కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది. అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ముందున్నారు. అలాగే..
● విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా బాగా పని చేస్తున్నారని మంచి ర్యాంకింగ్ దక్కింది.
● కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ పనితీరు కూడా బాగుందని నివేదిక పేర్కొంది.
అభినందన ‘పత్ర’ం
రావి ఆకుపై మాజీ సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
నారాయణఖేడ్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఖేడ్‌కు చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై చిత్రాలు మలిచారు. ప్రముఖుల జన్మదినోత్సవాలు, ఆయా పండుగలు, ప్రాధాన్యాలపై లీవ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ చిత్రాలు వేస్తూ విశిష్టతను తెలియపరుస్తుంటారు. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలను కూడా రావి ఆకులపై మలచి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment