గణిత పాఠ్యపుస్తక రచయితగా..
గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం. కానీ, అందులోని సూత్రాలు తెలిస్తే అన్ని సబ్జెక్టులకంటే ఎంతో సులువైనదని చెబుతున్నారు గణిత బోధకుడు వరద సుందర్‌రెడ్డి. ఉండవెల్లి మండలం తక్కశిల జెడ్పీహెచ్‌ఎస్‌లో గణిత బోధకుడిగా పనిచేస్తున్నారు. 22ఏళ్ల సర్వీసులో మొదటి ఏడాది తప్ప మిగిలిన 21 సంవత్సరాల నుంచి గణిత సబ్జెక్టులో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న 6, 7, 8, 9వ తరగతి గణిత పాఠ్యపుస్తక రచయితగా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో ఉన్న ఏకై క పాఠ్య పుస్తక రచయిత ఈయనే కావడం గర్వకారణం. సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులను గణితం వైపు ఆకర్షించేలా బోధన అందిస్తు మేటిగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment