చారిత్రక నిలువురాళ్ల సందర్శన
కృష్ణా: ముడుమాల్ గ్రామ శివారులో గల చారిత్రక ప్రాంతమైన నిలువురాళ్లను శనివారం జిల్లా శిక్షణ కలెక్టర్ గరిమనరుల్లా, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ ప్రాంతంలోని నిలువురాళ్లను, వాటి ప్రాముఖ్యతను ప్రొఫెసర్ పుల్లారావు ద్వారా తెలుసుకున్నారు. ఆదిమానవులు ఏర్పాటు చేసిన నక్షత్ర మండలితో పాటు రుతువులు తెలుసుకునేందుకు అప్పట్లో వారు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ దయాకర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment