ఆదిశిలాక్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ని దర్శించుకోలేని భక్తులు, నెలపూజ వరకు స్వామివారికి దాసంగాలను పెట్టి మొక్కలను చెల్లించుకోవడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.బారీకేడ్లతో భక్తుల క్యూలైన్లకు పోటెత్తారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు జెడ్పీ సీఈఓ కాంతమ్మ, ఇంటెలిజెన్సీ అడిషనల్ ఎస్పీతోపాటు వివిధ శాఖల అధికారులు వేర్వేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. అంతకు ముందు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. పూ జల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి.. మె మోంటోలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల వద్ద పోలీసులు, ఎస్‌వీఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తమ సేవలను అందించారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment