నేనేమి పాపం చేశానమ్మా..! | Sakshi
Sakshi News home page

నేనేమి పాపం చేశానమ్మా..!

Published Tue, May 7 2024 12:15 AM

నేనేమి పాపం చేశానమ్మా..!

చెత్తకుప్పలో ఆడశిశువు 

 ఐసీడీఎస్‌ సిబ్బందికి అప్పగింత

● చెత్తకుప్పలో ఆడశిశువు ● ఐసీడీఎస్‌ సిబ్బందికి అప్పగింత

జన్నారం: ‘‘నేనేమి పాపం చేశానమ్మా.. ఆడపిల్లగా జన్మించడమే నాకు శాపమా..? ఎర్రటి ఎండలో చెత్తకుప్పలో పడేశావు.. వెచ్చని నీ పొత్తిళ్లలో పాలు తాగాల్సిన నన్ను ఎవరూ లేని అనాథలా మార్చావు..!’’ ఆ పసికందుకు మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించదేమో..! కళ్లు తెరవని ఆడశిశువు చెత్తకుప్పలో పడేసిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్‌లో సోమవారం చోటు చేసుకుంది. పొనకల్‌లోని శ్రీలంకకాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు సమీపంలో పిచ్చిమొక్కల మధ్య ఉన్న చెత్తలో అప్పుడే జన్మించిన ఆడశిశువును గుర్తు తెలియని మహిళ పడేసి వెళ్లింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో శిశువు ఏడుపు వినిపించింది. దీంతో సమీపంలోని ఇంట్లో ఉన్న ప్రవీణ్‌ అనే యువకుడు అటువైపు వెళ్లి పరిశీలించాడు. ఏడుపు ఆగకపోవడంతో కర్రతో పరిశీలించగా శిశువు చేయి కనిపించింది. డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ఎస్సై రాజవర్ధన్‌ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, తుకరాం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఆడశిశువు కనిపించింది. ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించగా స్వాధీనం చేసుకుని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement