ఆప్ నాయకుడిపై దాడి
నస్పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త నయీమ్ పాషాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్లడ్ కాలనీలోని నయీమ్ ఇంటికి బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆప్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్‌తో తమకు బాగా పరిచయముందని తెలిపారు. తమకు తాళ్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో భూసమస్య ఉందని పేర్కొన్నారు. దాని విషయంలో తమకు సహకరించాలని కోరారు. దీంతో నయీమ్ మొదట నిరాకరించి తదుపరి వారి బలవంతం మేరకు అంగీకరించాడు. వారితో బయలు దేరి వెళ్లాడు. తాళ్ల్లపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కమాన్ వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు, వెంట వచ్చిన ఇద్దరు కలిసి వైఖరి మార్చుకోవాలని న యీమ్‌ను హెచ్చరి స్తూ బండరాయితో దాడి చేశారు. అటుగా వస్తున్న జనాలను చూసి నయీమ్ మొ బైల్ తీసుకుని పారి పోయారు. నయీం నస్పూర్ పీహెచ్‌సీకి వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎస్సై సుగుణాకర్‌ను సంప్రదించగా నయీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ నయీమ్‌పై జరిగిన దాడి ఘటనను ఖండించారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment