బకాయిలపై అసెంబ్లీలో చర్చించాలి
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.30వేల కోట్ల బకాయిలపై అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలను కోరారు. ఎస్‌ఆర్పీ–1 గనిపై బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడా రు. కోల్‌బెల్ట్ ఎంపీలు పార్లమెంటులో సింగరేణి బ కాయిలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని కోరారు. ఎన్నికల ముందు తమను గెలిపిస్తే కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంఘాలు, పార్టీలు నేడు గెలిచాక స్పందించడం లేదన్నారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను మాఫీ చేయాలని, మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికుల పేర్లను క్రమబద్ధీకరించాలని అన్నారు. డిమాండ్లపై యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కార్యదర్శి అంబాల శ్రీని వాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంగళ శ్రీనివాస్, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, గోపాల్ రాథోడ్, నాంపల్లి సంపత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment