బల్దియాలకు కొత్త ఉద్యోగులు
మంచిర్యాలటౌన్: గ్రూప్–4 ద్వారా ఇటీవల నియామకమైన జిల్లాకు చెందిన ఉద్యోగులు బుధవారం వారికి కేటాయించిన మున్సిపాలిటీల్లో చేరారు. వా ర్డు ఆఫీసర్లుగా 79 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా 10, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 9 మందిని జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు కేటాయించా రు. ఇందులో వార్డు ఆఫీసర్లుగా మంచిర్యాలకు 28 మంది, బెల్లంపల్లికి 9 మంది, మందమర్రికి 16 మంది, క్యాతన్‌పల్లికి 4, నస్పూర్‌కు 19 మంది, చె న్నూర్‌కు ముగ్గురిని కేటాయించారు. జూనియర్ అ సిస్టెంట్లుగా 18 మందికి పోస్టింగ్ ఇవ్వగా మంచి ర్యాలకు 2, బెల్లంపల్లికి 4, మందమర్రికి 2, క్యాతన్‌పల్లికి 2, నస్పూర్‌కు 4, లక్సెట్టిపేట్‌కు 3, చెన్నూరు కు 1 కేటాయించారు. జూనియర్ అకౌంటెంట్లుగా 10 మందికి పోస్టింగ్ ఇవ్వగా మంచిర్యాల మున్సి పాలిటీకి 2, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లికి ఒక్కొక్కటి చొ ప్పున, మందమర్రి, నస్పూర్, లక్సెట్టిపేటకు రెండు చొప్పున కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment