ప్రయోగపూర్వక బోధన చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రతీ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగ పూర్వక పాఠ్యాంశ బోధన చేయాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ, జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి జీవశాస్త్ర టాలెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 72 మంది విద్యార్థులు హాజరు కాగా.. విజేతలను ప్రకటించారు. తెలుగు మీడియంలో జెడ్పీహెచ్‌ఎస్ కిష్టాపూర్‌కు చెందిన అనిల్ ప్రథమ, పొక్కూర్ జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన ఐశ్వర్య ద్వితీయ, ఆంగ్ల మాధ్యమంలో జెడ్పీహెచ్‌ఎస్ గుడిరేవుకు చెందిన అంజి ప్రథమ, కలమడుగు పాఠశాలకు చెందిన అంజన్న ద్వితీయ స్థానం సాధించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల మంచిర్యాలకు చెందిన చరణ్ ప్రథమ, నక్షత్ర ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి టాలెంట్ పోటీలకు ఎంపికయ్యారు. విజేతలకు డీఈవో యాదయ్య బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాళవిదేవీ, డీఎస్‌వో మధుబాబు, జీవశాస్త్ర ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment